The Search

The Search

ఇస్తాంబుల్

టర్కీ లోని నగరం

ఇస్తాంబుల్ (టర్కిష్: ఇస్తాంబుల్, చారిత్రకంగా బైజాంటియన్, ఆ తరువాత కాన్‌స్టాంటినోపిల్ ; ఐరోపా లోని అధిక జనసాంద్రత గల నగరం, ప్రపంచంలో 4 నాలుగవ అత్యధిక జనాభా గల నగరం. టర్కీ యొక్క అతి పెద్ద నగరం, సాంస్కృతిక, వాణిజ్య కేంద్రం. ఇస్తాంబుల్ రాష్ట్రం కూడా, ఇందులో 27 జిల్లాలు ఉన్నాయి. టర్కీకు వాయ్యువ్యదిశలో, ఇది బోస్ఫొరస్ జలసంధి లోగల ప్రకృతిసిధ్ధమైన ఓడరేవు, దీనిని 'గోల్డన్ హార్న్' అని కూడా అంటారు. ఐరోపా, ఆసియా

ఖండాల మధ్య గల నగరం, ఇదో విశేషం. దీని సుదీర్ఘ చరిత్రలో 330-395 వరకు రోమన్ సామ్రాజ్యపు రాజధానిగాను, 395-1204 వరకు బైజాంటియన్ సామ్రాజ్యపు రాజధానిగాను, 1204-1261 వరకు లాటిన్ సామ్రాజ్యపు రాజధానిగాను,, 1453-1922 వరకు ఉస్మానియా సామ్రాజ్యపు రాజధాని గాను వుండినది. ఈ నగరం 2010 కొరకు జాయింట్ "యూరోపియన్ సాంస్కృతిక రాజధాని"గా నియామకమైంది. ఇస్తాంబుల్ లోని పలు చారిత్రకప్రాంతాలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించ బడ్డాయి.

Wikipedia · CC BY-SA