The Search
నైరోబి
నైరోబి కెన్యా దేశపు రాజధాని, అతిపెద్ద నగరం. ఈ నగరంలో ప్రవహించే నైరోబి నదిని ఉద్దేశించిన ఎంకరే నైరోబీ అనే పదబంధం నుంచి ఈ నగరానికా పేరు వచ్చింది. కెన్యా ప్రాంతీయ భాష మాసాయ్ లో ఎంకరే నైరోబీ అంటే చల్లని నీళ్ళు అని అర్థం. 2019 జనాభా లెక్కల ప్రకారం నగరం జనాభా 4,397,073. మెట్రోపాలిటన్ ఏరియాను కూడా కలుపుకుంటే 9,354,580. ఈ నగరాన్ని గ్రీన్ సిటీ ఇన్ ద సన్ అని వ్యవహరిస్తారు.
Wikipedia · CC BY-SA