The Search

The Search

ఫ్రెంచ్ ఫ్రైస్

బంగాళాదుంప ముక్కలను డీప్-ఫ్రై చేసి చేసే నంజుడు వంటకం

ఫ్రెంచ్ ఫ్రైస్, బాటోనెట్ లేదా జూలియన్ -కట్ పద్ధతిలో డీప్-ఫ్రై చేసిన బంగాళాదుంపలు. వీటిని ఉత్త ఫ్రైస్ అని, చిప్స్ అని, ఫింగర్ చిప్స్, అని కూడా అంటారు. వీటి మూలం వివాదాస్పదంగా ఉంది. బంగాళాదుంపలను సమానమైన ముక్కలుగా కోసి, ఆరబెట్టి, సాధారణంగా డీప్ ఫ్రైయర్‌లో వేయించి వీటిని తయారు చేస్తారు. ముందుగా కోసిన, బ్లాంచ్ చేసిన, ఫ్రీజరులో పెట్టిన రస్సెట్ బంగాళాదుంపలను విరివిగా ఉపయోగిస్తారు. కొన్నిసార్లు ఎయిర్ ఫ్రైయర్ వంటి సాధారణ లేదా కన్వెక్షన్ ఓవెన్‌లో వండుతారు.

Wikipedia · CC BY-SA