The Search

The Search

బ్యాంకాక్

థాయిలాండ్ యొక్క రాజధాని

బ్యాంకాక్ థాయిలాండ్ దేశపు రాజధాని. నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే అందమైన నగరం. అయితే బ్యాంకాక్‌ అసలు పేరు అత్యంత పొడవుగా ఉండి గిన్నిస్‌ బుక్‌లోనూ చోటు సంపాదించుకుంది. ఆ పేరు "క్రుంగ్‌ థెప్‌ మహా నాఖోన్‌ అమోన్‌ రతన కోసిన్‌ మహింత్రయుత్తయ మహ దిలోక్‌ పోప్‌ నప్ప రాట్‌ రటచా థాని బురి రోమ్‌ ఉడొమ్‌ రటాచ నివెట్‌ మహా సతాన్‌ అమోన్‌ ఫిమన్‌ అవటాన్‌ సట్‌హిట్‌ సఖ తాట్టియా విట్సనుకమ్‌ ప్రసిట్‌". ప్రస్తుతం ఇంతపొడవు పేరున్న ఈ నగరం బాహ్య ప్రపంచానికి బ్యాంకాక్‌, కానీ ఆ పొడవు పేరును కుదించి ‘క్రుంగ్‌ థెప్‌ మహా నిఖోన్‌’గా కానీ ‘క్రుంగ్‌ థెప్‌’గా కానీ స్థానికులు పిలుచుకుంటారు.

Wikipedia · CC BY-SA