The Search
ఢిల్లీ
భారతదేశపు మహానగరం, రాజధాని న్యూఢిల్లీతో కలిపి
ఢిల్లీ వ్యాసం ఆరంభంలో మూడు వేరు వేరు పదాలగురించి తెలుసుకోవాలి. జాతీయ రాజధాని ప్రదేశం. ఇది చట్టపరంగా ఏర్పాటు చేయబడిన ప్రదేశం. ఇందులో ప్రధాన విభాగాలు. జాతీయ రాజధాని ప్రదేశం ఒక కేంద్రపాలిత ప్రాంతంగా 1956 నవంబరు 1న ఏర్పాటు చేయబడింది. దేశం నలుమూలలనుండి రాజధాని నగరానికి ప్రజలు వలస వస్తుండడంవల్ల అక్కడ జనం వత్తిడి విపరీతంగా పెరుగుతుంది. అందువలన చుట్టుప్రక్కల నగరాలను స్వతంత్రంగా అభివృద్ధి చేయాలనే అభిప్రాయంతో జాతీయ రాజధాని ప్రదేశాన్ని ఏర్పరచారు.భారతదేశం రాజధాని: క్రొత్త ఢిల్లీ నగరం క్రొత్త ఢిల్లీ (హిందీ: नई दिल्ली ఇది భారతదేశపు రాజధాని. దీని విస్తీర్ణం 42.7 చదరపు కి.మీ. క్రొత్త ఢిల్లీ, ఢిల్లీ మెట్రోపాలిత ప్రాంతంలో ఉంది. ఇది భారత ప్రభుత్వ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో ఉంది.ఈ నగరాన్ని 20వ శతాబ్దంలో యునైటెడ్ కింగ్ డంకు చెందిన ఎడ్విన్ లుట్‌యెన్స్ నిర్మాణ నమూనా తయారుచేశాడు. ఈ నగరం తన విశాల మార్గాలు, వృక్ష-వరుసలు, అనేక సౌధాల కొరకు ప్రసిద్ధి.
పాత ఢిల్లీ :ఇది ఢిల్లీ నగరం లోని ఒక భాగం.దీనిని 1639 లో షాజహానాబాద్ పేరుతో షాజహాన్ దీనిని తన రాజధానిని ఆగ్రా నుండి మార్చుటకు దీనిని నిర్మించాడు. దీని నిర్మాణం 1639 లో ప్రారంభమై 1648 లో పూర్తయింది. అప్పటి నుండి 1857 లో మొగలు సామ్రాజ్యం పతనమయ్యే వరకూ ఇది వారికి రాజధానిగా ఉంది.
ఢిల్లీ కంటోన్మెంటు :దీనిని ఢిల్లీ కాంట్ అని కూడా పిలుస్తారు.ఇది 1914 లో స్థాపించబడింది.1938 ఫిబ్రవరి వరకు, కంటోన్మెంట్ బోర్డు ఢిల్లీని, కాంట్ అథారిటీ అని పిలుస్తారు.కంటోన్మెంట్ వైశాల్యం సుమారు 4,258 హెక్టార్లు లలో విస్తరించి ఉంది. 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం దీని పరిధిలో 59 పట్టణాలు, 165 గ్రామాలు ఉన్నాయి.2006 భారత కంటోన్మెంట్సు చట్టంప్రకారం, కంటోన్మెంట్ బోర్డుచే నిర్వహించబడుతుంది.
Wikipedia · CC BY-SA
delhi — ఢిల్లీ వ్యాసం ఆరంభంలో మూడు వేరు వేరు పదాలగురించి తెలుసుకోవాలి.
dictionary.aplusz.app