The Search

The Search

మార్క్ చాప్‌మన్

మార్క్ సింక్లైర్ చాప్‌మన్ హాంకాంగ్‌లో జన్మించిన న్యూజిలాండ్ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. అతను హాంకాంగ్, న్యూజిలాండ్‌ల కోసం పరిమిత ఓవర్లలో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ తరపున ఆడుతున్న చాప్‌మన్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్. ఎడమచేతి ఆర్థోడాక్స్ బౌలింగ్ చేస్తాడు. అతను 2015 నవంబరు 16న 2015–17 ICC వరల్డ్ క్రికెట్ లీగ్ ఛాంపియన్‌షిప్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై హాంకాంగ్ తరపున తన వన్డే అంతర్జాతీయ రంగప్రవేశం చేశాడు తండ్రి ద్వారా న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించడానికి అర్హత పొందాడు. 2018 ఫిబ్రవరిలో, అతను ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ తరపున T20I, వన్‌డే ల్లో ప్రవేశించాడు.

Wikipedia · CC BY-SA