The Search
భారత మలేషియా సంబంధాలు
భారతదేశం-మలేషియా సంబంధాలు, భారతదేశం, మలేషియాల మధ్య ద్వైపాక్షిక విదేశీ సంబంధాలు. భారతదేశానికి మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో హైకమిషన్ ఉంది. మలేషియాకు న్యూఢిల్లీలో హైకమిషన్ ఉంది. చెన్నై, ముంబైలలో కాన్సులేట్ జనరల్ ఉంది. రెండు దేశాలు కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, ఆసియా సహకార సంభాషణ, G15 లలో పూర్తి సభ్యదేశాలు. భారత మలేషియాలకు ప్రాచీన కాలం నుండీ సాంస్కృతిక, చారిత్రక సంబంధాలు ఉన్నాయి. మలేషియాలో భారతీయ వలసదారులు పెద్ద సంఖ్యలో ఉన్నందున రెండు దేశాలకు చక్కటి స్నేహపూర్వక సంబంధాలున్నాయి. మలేషియా నాల్గవ ప్రధాని, అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానీ అయిన మహాతిర్ మొహమ్మద్ కు భారతీయ మూలాలు ఉన్నాయి. వాణిజ్య రంగంలో రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణం $10.5 బిలియన్లు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది $20.01 బిలియన్లకు చేరుకుంటుందని భావించారు.
Wikipedia · CC BY-SA