The Search

The Search

మాడ్రిడ్

స్పెయిన్ రాజధాని

మాడ్రిడ్ స్పెయిన్ రాజధాని. యూరోపియన్ యూనియన్‌లో మూడవ అతిపెద్ద నగరం, ప్రపంచంలో 27 వ అతిపెద్ద నగరం. మాడ్రిడ్ దేశంలో ఒక ముఖ్యమైన ఆర్థికంగ, వాణిజ్య కేంద్రం. ప్రపంచంలోని అనేక పెద్ద, ముఖ్యమైన సంస్థల (కంపెనీలు) కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. రాజధాని నగరం కావడం వల్ల స్పెయిన్ ప్రభుత్వం, దాని మంత్రిత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు, జనరల్ కోర్టులు, సుప్రీంకోర్టు, రాజ్యాంగ న్యాయస్థానం మొదలైనవి ఇక్కడే ఉన్నాయి. ఇది స్పెయిన్ రాజులకు, ప్రధానమంత్రికి అధికారిక నివాసం కూడా. ఆర్థికంగా లండన్, పారిస్, మాస్కో తరువాత ఐరోపాలో ఇది నాల్గవ ధనిక నగరం. ఈ నగరం యొక్క మొత్తం వైశాల్యం 604.3 చదరపు కిలోమీటర్లు. జనాభా సుమారు 33 లక్షలు. మెట్రోపాలిటన్ ప్రాంతం, పొరుగు ప్రాంతాలతో సహా 65 లక్షలు. మాడ్రిడ్ నగరం మాడ్రిడ్ ప్రావిన్స్‌లోని మన్సనారే నది ఒడ్డున ఉంది. ఈ ప్రావిన్సుల సరిహద్దులుగాకాసాటిల్ లియోన్, కాసుటిల్లా మాన్సా యొక్క స్వయంప్రతిపత్త ప్రావిన్సులు ఉన్నాయి. మోనోకిల్ మ్యాగజైన్ ప్రకారం, 2017 సూచికలో, మాడ్రిడ్ ప్రపంచంలోనే జీవించడానికి అత్యంత అనువైన నగరాల్లో 10 వ స్థానంలో ఉంది. మాడ్రిడ్ 21 జిల్లాలుగా విభజించబడింది.

Wikipedia · CC BY-SA