The Search

The Search

ముంబై

మహారాష్ట్ర రాజధాని నగరం, జిల్లా

ముంబయి, పూర్వం దీనిని బొంబే అని పిలిచేవారు. ఇది భారత దేశంలోని ఒక ముఖ్య నగరం. ఇది మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని, భారత దేశంలో ఢిల్లీ తర్వాత రెండవ అత్యంత జన సమ్మర్ధం గల నగరం. అలాగే ప్రపంచంలో జనాభా పరంగా ఏడో స్థానంలో ఉంది. దీని ప్రస్తుత జనాభా 13 మిలియన్లు. ఇది మహారాష్ట్రలోని పశ్చిమ సముద్ర తీరంలోని సాష్టీ ద్వీపంలో ఉంది. ఆధునిక భారతదేశ విభిన్నతను ఈ నగరంలో చూడచ్చు. ఈ నగర సినీ పరిశ్రమ, రాజకీయాలు, నేరస్థులు కలసిపోయి భవిష్యత్తు గురించి ఆందోళన కలిగిస్తుంది అదే సమయంలో ఈ నగర వాసుల సాహసం ఆశ కలిగిస్తుంది.దక్షిణ ఆసియాలో ముంబాయ్ అతి పెద్ద నగరం. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం.

Wikipedia · CC BY-SA

mumbai — ముంబయి, పూర్వం దీనిని బొంబే అని పిలిచేవారు.

dictionary.aplusz.app