The Search

The Search

చెక్ గణతంత్రం జాతీయ గ్రంథాలయం

చెక్ గణతంత్రం జాతీయ గ్రంథాలయం చెక్ గణతంత్రం దేశపు కేంద్ర గ్రంథాలయం. ఇది దేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంది. లైబ్రరీ ప్రధాన భవనం ప్రాగ్ మధ్యలో ఉన్న చారిత్రక క్లెమెంటినమ్ భవనంలో ఉంది. లైబ్రరీ లోని దాదాపు సగం పుస్తకాలు ఇక్కడ ఉంటాయి. మిగిలిన సగం పుస్తకాలు హోస్టివార్ జిల్లాలో ఉంటాయి. నేషనల్ లైబ్రరీ చెక్ గణతంత్రం‌లో అతిపెద్ద లైబ్రరీ. ఇందులో దాదాపు 60 లక్షల డాక్యుమెంట్‌లున్నాయి. లైబ్రరీలో ప్రస్తుతం దాదాపు 20,000 మంది నమోదిత పాఠకులు ఉన్నారు. ఎక్కువగా చెక్ భాషా పుస్తకాలు ఉన్నప్పటికీ, ఈ లైబ్రరీలో టర్కీ, ఇరాన్, భారతదేశాలకు చెందిన పాత విషయాలను కూడా నిల్వ చేస్తుంది. లైబ్రరీలో ప్రేగ్‌లోని చార్లెస్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి.

Wikipedia · CC BY-SA