The Search

The Search

వార్సా

పోలాండ్ రాజధాని

వార్సా పోలండ్ దేశంలో అతిపెద్ద నగరం, రాజధాని. ఈ నగరం పోలండ్ తూర్పు మధ్యభాగంలో విస్టులా నది పక్కన ఉంది. నగరం సరిహద్దుల్లో 18 లక్షల జనాభా ఉండగా, గ్రేటర్ మెట్రోపాలిటన్ ఏరియా లో సుమారు 31 లక్షలమంది ప్రజలు నివసిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ లో వార్సా ఏడవ అత్యధిక జనాభా కలిగిన నగరం. నగర హద్దులు 517.24 చదరపు కిలోమీటర్లు కాగా గ్రేటర్ ఏరియా 6,100.43 చ.కి.మీ వైశాల్యం కలిగిఉంది. వార్సా ఒక ఆల్ఫా గ్లోబల్ సిటీ, పేరొందిన అంతర్జాతీయ పర్యాటక కేంద్రం, చెప్పుకోదగిన సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక కేంద్రం. దీనిలో ఉన్న ప్రాచీన నగరం ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఒకటి.

Wikipedia · CC BY-SA